మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజులోనే 139 మరణాలు..

| Edited By:

Jun 05, 2020 | 8:38 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. నిత్యం రెండువేలకు పైగా కేసులు వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి.శుక్రవారం నాడు రికార్డు స్థాయిలో కేసుల నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజులోనే 139 మరణాలు..
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. నిత్యం రెండువేలకు పైగా కేసులు వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి.శుక్రవారం నాడు రికార్డు స్థాయిలో కేసుల నమోదయ్యాయి. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం నాడు కొత్తగా మరో 2,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,229కి చేరింది. ఇక ఇప్పటి వరకు 35,156 మంది కరోనా నుంచి కొలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 42,224 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక శుక్రవారం నాడు కరోనా బారినపడి 139 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 2,849 మంది మరణించారు. ముఖ్యంగా ముంబై, థానే,పూణె నగరాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. అటు పోలీస్ సిబ్బందికి కూడా కరోనా సోకుతుండటంతో.. ఖాకీలలో కూడా భయం పట్టుకుంది. ఇప్పటికే రెండు వేల మందికి పైగా పోలీసులకు కరోనా సోకింది. వీరిలో 30 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.