New Covid Cases: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ కలకలం.. ఒక్క రోజే కొత్తగా 6,362 కోవిడ్ కేసులు

|

Feb 20, 2021 | 1:03 AM

మహా­రా­ష్ట్రలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ..

New Covid Cases: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ కలకలం.. ఒక్క రోజే కొత్తగా 6,362 కోవిడ్ కేసులు
Maharashtra Corona
Follow us on

New Covid Cases: మహా­రా­ష్ట్రలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 6,362 కరోనా కేసులు, 44 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,632కు, మర­ణాల సంఖ్య 51,713కు చేరింది.

మరో­వైపు గత 24 గంటల్లో 2,159 మంది కరోనా రోగులు కోలు­కుని ఆసు­ప­త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలు­కున్న వారి మొత్తం సంఖ్య 19,89,963కు చేరి­నట్లు ఆ రాష్ట్ర ఆరో­గ్య­శాఖ తెలి­పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,713 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్ల­డిం­చింది.

మరోవైపు కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Also Read:

RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు… ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే బీర్‌ ఫ్రీ.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన పబ్‌ నిర్వాహకులు