లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించి.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..

|

Apr 30, 2020 | 9:17 PM

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలతో దాన్ని అమలు చేస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే బయటికి రాకూడదని.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అయితే కొందరు మాత్రం లాక్‌డౌన్‌ రూల్స్‌ను అతిక్రమిస్తున్నారు. ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవద్దని కేంద్రం చెప్పినా కూడా వినకుండా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో యధేచ్ఛగా, స్వేచ్ఛగా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. […]

లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించి.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..
Follow us on

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలతో దాన్ని అమలు చేస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే బయటికి రాకూడదని.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అయితే కొందరు మాత్రం లాక్‌డౌన్‌ రూల్స్‌ను అతిక్రమిస్తున్నారు. ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవద్దని కేంద్రం చెప్పినా కూడా వినకుండా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో యధేచ్ఛగా, స్వేచ్ఛగా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. జోథ్‌పూర్‌లో ఓ వర్గం లాక్‌డౌన్‌ రూల్స్‌ అతిక్రమించి సామూహిక ప్రార్థనలను నిర్వహించింది. అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా గుంపులుగా చేరి నమాజ్‌ చేశారు. జోధ్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీ హాల్‌లో చేరి ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.

Read Also:

ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!

దారుణం: ప్రేమించిన పాపానికి హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు..