లాక్‌డౌన్‌ ఎఫెక్ట్.. పోలీసులే ఆత్మీయులై అంత్యక్రియలు..

| Edited By:

Apr 24, 2020 | 7:55 PM

కరోనా మహమ్మారి కనీసం ఆత్మీయులను కడచూపు కూడా చూడనీయకుండా చేస్తోంది. ఇప్పటికే ఎంతో ఈ మహమ్మారి చేయబట్టి.. రక్త సంబంధీకులు మరణించినా కూడా కనీసం చివరి చూపు చూసేందుకు కూడా భయ పడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా.. ఢిల్లీలో ఓ ఘటన చూస్తే.. కరోనా మనుషుల పట్ల ఎంత కర్కషంగా వ్యవహరిస్తోందో అర్ధమవుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రనభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. అయితే ఈ క్రమంలో ఎంతో మంది తమ ఆత్మీయులను […]

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్.. పోలీసులే ఆత్మీయులై అంత్యక్రియలు..
Follow us on

కరోనా మహమ్మారి కనీసం ఆత్మీయులను కడచూపు కూడా చూడనీయకుండా చేస్తోంది. ఇప్పటికే ఎంతో ఈ మహమ్మారి చేయబట్టి.. రక్త సంబంధీకులు మరణించినా కూడా కనీసం చివరి చూపు చూసేందుకు కూడా భయ పడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా.. ఢిల్లీలో ఓ ఘటన చూస్తే.. కరోనా మనుషుల పట్ల ఎంత కర్కషంగా వ్యవహరిస్తోందో అర్ధమవుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రనభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. అయితే ఈ క్రమంలో ఎంతో మంది తమ ఆత్మీయులను కుటుంబ సభ్యులను దూరం చేస్తోంది. కనీసం వారు మరణిస్తే అంత్యక్రియలను చూసేందుకు కూడా నోచుకోలేకపోతున్నారు.

ఢిల్లీలో జరిగిన సంఘటన చూస్తే..తన భర్త చనిపోతే అంత్యక్రియలు కూడా నిర్వహించడాని​కి వీలు లేకపోవడంతో.. పోలీసులతోనే ఆ కార్యక్రమాన్ని జరిపించాల్సి వచ్చింది ఓ కుటుంబానికి. యూపీలోని గోరక్‌పూర్‌కు చెందిన వ్యక్తి ఏప్రిల్‌ 13న చికెన్‌పాక్స్‌తో ఢిల్లీలోని ఓ ఆస్సత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో మృతుడి కుటుంబ సభ్యులు ఢిల్లీకి రాలేకపోయారు. దీంతో 10 రోజులుగా మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. అయితే మృతుడి భార్య.. తన భర్త మృతదేహాన్ని తమ స్వస్థలానికి పంపించండని.. లేని పక్షంలో అక్కడే అంత్యక్రియలు చేయడంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి​కి హిందూ సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు.