Breaking: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. కొత్త లిస్టు ఇదే..

|

May 06, 2020 | 9:29 AM

తెలంగాణలో కంటైన్మెంట్ ఏరియాస్ మినహాయించి మిగతా జోన్లలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక బార్లు, పబ్‌లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అటు చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్డినరీ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.10, 375 ఎంఎల్‌పై రూ.20, 750 ఎంఎల్‌పై రూ.40 అదనంగా పెరిగింది. ఇక మీడియం […]

Breaking: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. కొత్త లిస్టు ఇదే..
Follow us on

తెలంగాణలో కంటైన్మెంట్ ఏరియాస్ మినహాయించి మిగతా జోన్లలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక బార్లు, పబ్‌లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అటు చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఆర్డినరీ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.10, 375 ఎంఎల్‌పై రూ.20, 750 ఎంఎల్‌పై రూ.40 అదనంగా పెరిగింది. ఇక మీడియం లిక్కర్‌కు సంబంధించి 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40, 750 ఎంఎల్‌పై రూ.80 పెరిగింది. ప్రీమియం లిక్కర్‌ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.30, 375 ఎంఎల్‌పై రూ.60, 750 ఎంఎల్‌పై రూ.120 అదనంగా పెరిగింది.

మరోవైపు స్కాచ్ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.40, 375 ఎంఎల్‌పై రూ.80, 750 ఎంఎల్‌పై రూ.160 అదనంగా పెరిగింది. ఇక అన్ని సైజుల బీర్‌పై ఫ్లాట్ రూ.30 పెరిగింది. కాగా, వైన్ షాపుల వద్ద భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని.. మాస్కులు ధరిస్తేనే షాపు యజమానులు మద్యం అమ్మాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రూల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.