కరోనా భయంతో వణికిపోతున్న కూకట్‌పల్లి

|

Jul 08, 2020 | 7:35 PM

Kukatpally Trembling with Fear of Corona : గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా హడలెత్తిస్తోంది. రోజుకు వెయ్యికి మించి కేసులు నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు లాక్ డౌన్ అంటూ ప్రచారం… మరో వైపు పెరుగుతున్న కేసులతో భయపడిపోయిన జనం పట్టణం విడిచి పల్లె బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ సగం మేర కాలి అయ్యిపోయింది. చాలా మంది జనం ఊరి బాట పట్టారు. హైదరాబాద్ ఒక్కెత్తైతే కూకట్‌పల్లి మరో ఎత్తు.. అక్కడ కేసులు ఎక్కవగా […]

కరోనా భయంతో వణికిపోతున్న కూకట్‌పల్లి
Follow us on

Kukatpally Trembling with Fear of Corona : గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా హడలెత్తిస్తోంది. రోజుకు వెయ్యికి మించి కేసులు నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు లాక్ డౌన్ అంటూ ప్రచారం… మరో వైపు పెరుగుతున్న కేసులతో భయపడిపోయిన జనం పట్టణం విడిచి పల్లె బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ సగం మేర కాలి అయ్యిపోయింది. చాలా మంది జనం ఊరి బాట పట్టారు.

హైదరాబాద్ ఒక్కెత్తైతే కూకట్‌పల్లి మరో ఎత్తు.. అక్కడ కేసులు ఎక్కవగా నమోదవుతుండటంతో జనం వణికిపోతున్నారు. జనం రూల్స్ పాటించక పోవడం.. సోషల్ డిస్టెన్స్‌ను పట్టించుకోక పోవడం వ ల్లే కేసులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూకట్ పల్లిలో 250 కేసులు నమోదయ్యాయి. రోజుకు 20 కేసులు వస్తున్నాయంటే అక్కడ కరోనా తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.