Corona Virus: దేశంలో కరోనా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొవిడ్ సోకిన వారు దీర్ఘకాలికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా తర్వాత కూడా ప్రజలకు కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కళ్ళ ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు నమ్ముతున్నారు. అటువంటి పరిస్థితిలో కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అసలు కరోనా, కళ్లకి మధ్య సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కళ్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా?
కరోనా, కళ్ల మధ్య సంబంధం గురించి AIIMS వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ‘కోవిడ్ కళ్ల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి కరోనాతో బాధపడుతుంటే అతని కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతుంటే వైరస్ అందులో నివసిస్తుంది. ఒక వ్యక్తికి కోవిడ్ వ్యాధి ఉంటే అతనికి దగ్గు, జలుబు లేదా ఊపిరితిత్తుల సమస్య, కళ్ళు ఎర్రబడటం, కళ్లలో వాపు ఉంటే అప్పుడు కళ్లలో కూడా వైరస్ ఉన్నట్లే లెక్క’ అని అన్నారు. అయితే కన్నీళ్లు రోగి చేతికి అంటుకొని దాని ద్వారా ఇతరులకు సోకుతుంది. అందుకే ఎప్పుడూ చేతులు కడుక్కోవాలని, ఎవరితోనూ కరచాలనం చేయవద్దని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి కళ్ళను రక్షించడానికి అద్దాలు ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు.
కరోనా తర్వాత, కంటిపై ప్రభావం ఉంటుందా..?
రోగికి ఇప్పటికే కొన్ని వ్యాధులు ఉంటే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహారణకు డయాబెటీస్ ఉంటే దాని ప్రభావం మొత్తం కంటిని పాడు చేస్తుంది. కరోనా సమయంలో ఎలాంటి జబ్బులు లేని వారికి కళ్లు ఎర్రగా మారుతాయి. కరోనా తర్వాత కూడా కంటి వ్యాధులు సంభవిస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ ప్రభావం కళ్లలో కూడా ఉంటుంది. కోవిడ్ వ్యాధి కారణంగా శరీరంలోని మిగిలిన భాగాలపై ప్రభావం ఉంటే అది కళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం కంటి తెరపై అంటే రెటీనాపై ఉంటుంది.