AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో మరో కరోనా ఐదు హాట్‌స్పాట్స్‌..

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా బుధవారం నాడు మరో 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.

కేరళలో మరో కరోనా ఐదు హాట్‌స్పాట్స్‌..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2020 | 10:46 PM

Share

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా బుధవారం నాడు మరో 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇక రాష్ట్రంలో మరో ఐదు హాట్‌స్పాట్స్‌ను గుర్తించినట్లు కూడా వెల్లడించారు. ఇక బుధవారం నాడు నమోదైన కేసుల్లో కోజిక్కోడ్‌లో 10, తిరుసూర్‌ 9, మలప్పురం 7, తిరువనంతపురం 6, పాలక్కడ్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఇక ఇడుక్కి, కొల్లాం, వయనాడ్‌,కన్నూర్ లలో మూడు చోప్పున నమోదవ్వగా పతనంతిట్ట, కొట్టాయం అలప్పుజా జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి 905 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం 1,238 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.10లక్షల మందిని అబ్జర్వేషన్లో ఉంచామని.. వీరిలో 2.08 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని.. కొందరు ఇతర క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారని తెలిపారు. 1,844 మంది ఆస్ప్రత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారని తెలిపారు. ఇక గడిచిన 24 గటంల్లో 4,689 టెస్టులు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 98,475 పరీక్షలు చేపట్టగా.. 93,475 పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని పేర్కొన్నారు.

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..