కర్ణాటకలో రెండున్నర లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్‌లాక్ 1.0 ప్రక్రియ అనంతరం రాష్టంలో పాజిటివ్ కేసులు అమాంతం..
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్‌లాక్ 1.0 ప్రక్రియ అనంతరం రాష్టంలో పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గురువారం నాటికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మార్క్‌ను దాటేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,385 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,975కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,70,381 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 82,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 4,429 మంది మరణించారు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు అర్బన్ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి.
7,385 new #COVID19 cases, 6,231 recovered cases & 102 deaths reported in Karnataka in the last 24 hours. Total number of positive cases stands at 2,56,975 including 82,149 active cases, 1,70,381 recovered cases & 4,429 total deaths till date: State Health Department, Karnataka pic.twitter.com/dY34DNXqNR
— ANI (@ANI) August 20, 2020
Read More :