మాస్క్ ధరించలేదు.. అందుకే ఫైన్ కట్టేశా.. కాన్పూర్ ఐజీపీ

ఈ కరోనా టైములో ప్రతివారూ మాస్కులు ధరించడం తప్పనిసరి ! పోలీసులైనా.. ఎవరైనా సరే ! మాస్కులకు మేం అతీతులం అంటే రూల్స్ ఒప్పుకోవు. అందువల్లే..

మాస్క్ ధరించలేదు.. అందుకే ఫైన్ కట్టేశా.. కాన్పూర్ ఐజీపీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 07, 2020 | 3:47 PM

ఈ కరోనా టైములో ప్రతివారూ మాస్కులు ధరించడం తప్పనిసరి ! పోలీసులైనా.. ఎవరైనా సరే ! మాస్కులకు మేం అతీతులం అంటే రూల్స్ ఒప్పుకోవు. అందువల్లే కాన్పూర్ రేంజ్ ఐజీపీ మోహిత్ అగర్వాల్ కూడా తన తప్పిదానికి తానే జరిమానా విధించుకున్నారు. బయట పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఆయన మాస్క్ ధరించలేదట. ఈ కారణంగా బర్రా పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని తనకు ఫైన్ విధించాల్సిందిగా ఆయన కోరారట. ఆ అధికారి కూడా చాలాన్ కాపీని ఇవ్వగా మోహిత్ అగర్వాల్.. వంద రూపాయల జరిమానా చెల్లించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ఈ పోలీసు స్టేషన్ పరిధి లోని ప్రాంతానికి ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించకుండానే కొంతమంది అధికారులతో మాట్లాడానని, అయితే జరిగిన పొరబాటు తెలుసుకుని వెంటనే తన వాహనం నుంచి దాన్ని తీసి ధరించానని చెప్పారు. పోలీసులకు, ప్రజలకు కూడా ఆదర్శంగా ఉండాలనే తాను జరిమానా చెల్లించినట్టు ఆయన పేర్కొన్నారు.