కరణ్‌పై కారాలు.. మిరియాలు నూరిన కంగన

ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి కరణ్‌ జోహార్‌పై నిప్పులు చెరిగింది. కరణ్‌ జోహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఓ అంతర్జాతీయ వేదికపై తనను కరణ్‌ కించపరిచాడని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు..

కరణ్‌పై కారాలు.. మిరియాలు నూరిన కంగన

Edited By:

Updated on: Aug 18, 2020 | 5:33 PM

ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి కరణ్‌ జోహార్‌పై నిప్పులు చెరిగింది. కరణ్‌ జోహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఓ అంతర్జాతీయ వేదికపై తనను కరణ్‌ కించపరిచాడని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ట్వీట్‌ చేసింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశాడని విరుచుకుపడింది. ఉరి ఘటన సమయంలో దేశమంతా ఆర్మీకి అండగా నిలిస్తే కరణ్‌ జోహర్‌ మాత్రం పాకిస్తాన్‌కు సపోర్ట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేశారని తెలిపింది కంగనా రనౌత్‌. ఇప్పుడేమో గుంజన్‌ సక్సేనా సినిమాలో నానా చెత్త చూపించాడని మండి పడింది.

గత కొద్దికాలంగా భాస్వరంలా మండిపడుతున్న కంగనా రనౌత్‌… అమిర్‌ఖాన్‌ను కూడా వదల్లేదు.. లాల్‌సింగ్‌ చద్దా సినిమా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లిన అమిర్‌ అక్కడి ప్రథమ మహిళ ఎమిన్‌ ఎర్డోగాన్‌ను కలవడాన్ని కంగన తప్పుపట్టింది. కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన విషయాన్ని అమిర్‌ మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నించింది. ఇది ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం అని, దీనిపై ఆమిర్‌ వెంట‌నే స్పందించాల‌ని కోరింది. ఓ ఐకాన్‌లా దేశంలో అనేక ప్రశంసలు అందుకున్నఅమిర్‌ఖాన్ ఇప్పుడు ఇలా చేయడం బాగోలేదని విమర్శించారు ఈ విష‌యంపై చాలా మంది మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌ని, అమిర్‌ చ‌ర్య‌లు చాలామందిని బాధ‌పెడుతున్నాయని కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేశారు.

Also Read:

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు