INS Airavat: కొనసాగుతున్న ఆపరేషన్ సముద్ర సేతు – 2.. సింగపూర్ నుంచి విశాఖకు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు

|

May 10, 2021 | 1:46 PM

కోవిడ్‌-19 చికిత్సలో ఎదురవుతున్న ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సింగపూర్‌, యూఏఈల నుంచి అత్యధిక సామర్థ్యం గల ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది.

INS Airavat: కొనసాగుతున్న ఆపరేషన్ సముద్ర సేతు – 2.. సింగపూర్ నుంచి విశాఖకు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు
Ins Airavat To Reach Oxygen Tanks And Cylinders
Follow us on

INS Airavat to reach Oxygen: కోవిడ్‌-19 చికిత్సలో ఎదురవుతున్న ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సింగపూర్‌, యూఏఈల నుంచి అత్యధిక సామర్థ్యం గల ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశాలతో జరిపిన చర్చలు ఫలించడంతో క్రయోజినిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి జరుగుతోంది. దీని కోసం అక్సిజన్‌ సముద్ర సేతు-2 అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం.

దేశంలో ఆక్సిజన్​ కొరతను అధిగమించేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్​ సముద్ర సేతు-2 పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్​ కంటెయినర్లతో సహా అనుబంధ వైద్య పరికరాలను యుద్దనౌకల ద్వారా భారత్​కు చేరవేస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ నుంచి విశాఖ కు సముద్రం మార్గం గుండా ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ద నౌకలు చేరుకున్నాయి. ఇప్పటివరకు 8 క్రయోజినిక్ ఆక్సిజన్ ట్యాంకర్లతో పాటు 3,898 ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య సామగ్రితో సింగపూర్ నుంచి విశాఖ చేరిన ఐ ఎన్ ఎస్ ఐరావత్ అనే యుద్ధ నౌక మోసుకువచ్చింది.

ఈ నెల 5 న సింగపూర్ లో బయలుదేరిన యుద్దనౌక ఐ ఎన్ ఎస్ ఐరావత్ విశాఖ తీరం చేరుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు- 2 లో భాగంగా కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న 9 నౌకలలో ఐ ఎన్ ఎస్ అమరావతి ఒకటి కావడం విశేషం. ఆపరేషన్ సముద్ర సేతు-II లో భాగంగా గల్ఫ్, ఆగ్నేయ ఆసియా లోని ఫ్రెండ్లీ దేశాలనుంచి మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు వైద్యపరికరాల సహాయం అందుతోంది.

Read Also.. King Koti Hospital: కింగ్ కోఠి ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదు.. ఆక్సిజన్ అందుబాటులోనే ఉంది: డీఎంఈ