Coronavirus outbreak: ఎసిడిటీ మాత్రతో కరోనాకు చెక్ !

కోర‌లు చాస్తున్న కోవిడ్‌-19 వైర‌స్‌ని అంత‌మొందించ‌గ‌ల ఖ‌చ్చిత‌మైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఉపశ‌మనం కోసం రోగులకు వైద్యులు రకరకాల ట్యాబ్లెట్లు అందించి నయం చేస్తున్నారు.తాజాగా

Coronavirus outbreak: ఎసిడిటీ మాత్రతో కరోనాకు చెక్ !
Follow us

|

Updated on: Jun 11, 2020 | 6:02 PM

కోర‌లు చాస్తున్న కోవిడ్‌-19 వైర‌స్‌ని అంత‌మొందించ‌గ‌ల ఖ‌చ్చిత‌మైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఉపశ‌మనం కోసం రోగులకు వైద్యులు రకరకాల ట్యాబ్లెట్లు అందించి నయం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైడ్రాక్సి క్లోరోక్వీన్, పారసిటమల్ వాడాలంటూ చెప్పుకొచ్చారు. తాజాగా మరో మందు బిళ్ల కూడా కరోనాను తగ్గిస్తుందని తేల్చారు. కడుపులో ఉబ్బరం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యల నివారణకు వాడే మాత్రతో కరోనాకు సంబంధించిన కొన్ని లక్షణాలను తగ్గించవచ్చని అమెరికాలోని ఓ పరిశోధన సంస్థ అధ్య‌య‌నంలో తేలింది. ఈ మేర‌కు మెడికల్‌ జర్నల్‌ గట్‌లో తమ పరిశోధన అంశాలను ప్రచురించారు.

దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలున్న కరోనా రోగులు ఫామోటిడిన్ మాత్రలు వేసుకున్న తర్వాత వీటి నుంచి ఉపశమనం పొందినట్లు ఆ అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు దీనిపై ప్రయోగం చేశారు. కరోనా సోకిన ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలకు ఫామోటిడిన్ మాత్రలు ఇచ్చారు. 80 మిల్లీగ్రాముల మాత్ర రోజుకు మూడుసార్లు చొప్పున 11 రోజులపాటు ఇవ్వగా మంచి ఫలితాలు కనిపించినట్లు తెలిపారు.

కరోనా రోగుల్లో సాధారణంగా కనిపించే ఐదు ప్రాథమిక లక్షణాలైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలనొప్పి, వాసన, రుచిని గుర్తించకపోవడం వంటి సమస్యల నుంచి వారు ఉపశమనం పొందినట్లు తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వైరస్‌ బాధితులకు ఇది పనిచేయవచ్చన్నారు. అయితే కరోనా చికిత్సలో ఫామోటిడిన్ మాత్రల వినియోగంపై మరింతగా క్లీనికల్‌ ట్రయల్స్ జర‌గాల్సి ఉన్నదని పేర్కొన్నారు.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..