ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. రైల్వేశాఖ మరో కీలక ప్రకటన..

|

May 22, 2020 | 12:02 AM

లాక్ డౌన్ ముగుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రయాణీకులకు జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ మరో కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లను తెరుస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. స్థానికంగా ఉన్న కరోనా కేసులు, పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతానికి కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే రిజర్వేషన్ కౌంటర్లను అందుబాటులో ఉంచాలని జోనల్ రైల్వేస్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కౌంటర్లలో జూన్ ఒకటి నుంచి […]

ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. రైల్వేశాఖ మరో కీలక ప్రకటన..
Follow us on

లాక్ డౌన్ ముగుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రయాణీకులకు జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ మరో కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లను తెరుస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. స్థానికంగా ఉన్న కరోనా కేసులు, పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతానికి కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే రిజర్వేషన్ కౌంటర్లను అందుబాటులో ఉంచాలని జోనల్ రైల్వేస్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కౌంటర్లలో జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే రైళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వనున్నారు. ఇక ఇప్పటిదాకా IRCTC ద్వారానే టికెట్ బుకింగ్ సదుపాయాన్ని రైల్వేశాఖ ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

Read This: విమాన సంస్థలకు షాక్.. టికెట్ ధరలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..