విమాన సంస్థలకు షాక్.. టికెట్ ధరలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

లాక్ డౌన్ 4.0లో కేంద్రం పలు సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రజా రవాణా ఒక్కొక్కటిగా ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగానే మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఈ క్రమంలోనే విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచకుండా వాటిని ఏడు గ్రూపులుగా విభజించిన కేంద్ర పౌర విమానయాన శాఖ.. కనిష్టంగా 2000 నుంచి గరిష్టంగా 18,600 మించరాదని సూచించింది. ప్రయాణీకులకు విమానంలో భోజనం ఉండదని.. తప్పనిసరిగా అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని కేంద్ర […]

విమాన సంస్థలకు షాక్..  టికెట్ ధరలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..
Follow us

|

Updated on: May 21, 2020 | 8:29 PM

లాక్ డౌన్ 4.0లో కేంద్రం పలు సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రజా రవాణా ఒక్కొక్కటిగా ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగానే మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఈ క్రమంలోనే విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచకుండా వాటిని ఏడు గ్రూపులుగా విభజించిన కేంద్ర పౌర విమానయాన శాఖ.. కనిష్టంగా 2000 నుంచి గరిష్టంగా 18,600 మించరాదని సూచించింది.

ప్రయాణీకులకు విమానంలో భోజనం ఉండదని.. తప్పనిసరిగా అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ప్రయాణీకులు అందరి దగ్గర ఆరోగ్యసేతు యాప్ ఖచ్చితంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు విమాన ప్రయాణాన్ని కూడా ఏడు కేటగిరీలుగా విభజించారు. 0 నుంచి 30 నిమిషాలు.. 30 నుంచి 60 నిమిషాలు – 60 నుంచి 90 నిమిషాలు – 90 నుంచి 120 నిమిషాలు – 120 నుంచి 150 నిమిషాలు – 150 నుంచి 180 నిమిషాలు – 180 నుంచి 210 నిమిషాలు.. ఉన్నాయి. ఇక కేంద్ర పౌర విమానయానశాఖ సూచించిన ఛార్జీలు మూడు నెలల పాటు అమలులో ఉంటాయని మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ నుంచి ముంబయి నడిచే విమానంలో మాత్రం 40 శాతం సీట్లను తక్కువ ధరకు.. మరో 50 శాతం సీట్లను రూ.6,700కు విక్రయించనున్నట్లు తెలిపింది.

Read This: ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు.. సెలూన్స్‌కు వెళ్లేవారు ఇవి పాటించాల్సిందే..