India Corona Cases: జెట్‌ స్పీడ్‌తో కోరలు చాస్తున్న కరోనా.. 24 గంటల్లో 55 శాతంకు పైగా కేసులు..

|

Jan 06, 2022 | 9:43 AM

భారత్‌లో కరోనా కోరలు చాచింది. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న 58వేలకు పైగా కేసులు నమోదవగా..ఇవాళ అంతకు రెట్టింపు కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో..

India Corona Cases: జెట్‌ స్పీడ్‌తో కోరలు చాస్తున్న కరోనా.. 24 గంటల్లో 55 శాతంకు పైగా కేసులు..
Covid Cases
Follow us on

భారత్‌లో కరోనా కోరలు చాచింది. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న 58వేలకు పైగా కేసులు నమోదవగా..ఇవాళ అంతకు రెట్టింపు కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,928 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇది నిన్నటి 58,097 కేసుల కంటే 55 శాతం ఎక్కువ. రికవరీ రేటు ప్రస్తుతం 97.81 శాతంగా ఉంది. గత మూడు రోజుల్లో 50వేలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,85,401 ఉండగా..  ఇప్పటి వరకు 3,43,41,009 మంది రికవరీ అయ్యారు. కొత్తగా 325 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాతో 4,82,876 మంది మరణించారు.

ఇక అంతకు మించి అన్నట్టుగా ఒమిక్రాన్‌ కూడా విలయం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 2,658కి చేరాయి న్యూ వేరియంట్‌ కేసులు. దేశంగా కొత్తగా 378 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక వీకెండ్‌ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. తాజాగా తమిళనాడు కూడా ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ విధించింది. ఇవాల్టి నుంచి నైట్‌ కర్ఫ్యూ అమలుచేస్తోంది. మాల్స్‌, థియేటర్లు50 శాతం ఆక్యుపెన్సీతో నడవనున్నాయి.

Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్‌.. పిలుపునిచ్చిన బీజేపీ

Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..