Indian Corona Cases: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 3.66 లక్షల మందికి పాజిటివ్, 3,747 మంది మృతి

|

May 10, 2021 | 8:59 AM

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 3,66,317 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

Indian Corona Cases: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 3.66 లక్షల మందికి పాజిటివ్, 3,747 మంది మృతి
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 3,66,317 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అటు క‌రోనా బారినపడి ఆదివారం ఒక్కరోజే 3,747 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

కాగా, ఆదివారం క‌రోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో చనిపోయిన 3,747 మందితో కలిపి మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 2,46,146 కు చేరింది. దేశంలో ప్రస్తుతం క‌రోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 37,41,368కు చేరింది. అయితే, భారత్‌లో మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. గత 24 గంటల్లో క‌రోనా కార‌ణంగా మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో నమోదైన 3,66,317 కేసుల్లో 71.75 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీతో సహా 10 రాష్ట్రాలకు చెందినవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also…  కొవిడ్-19 రోగులలో ‘బ్లాక్ ఫంగస్’..? ICMR సూచనలు ఏంటి.. ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు..