Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్ బారిన పడ్డారంటే..

|

Jan 27, 2022 | 10:19 AM

దేశంలో కరోనా (C0vid 19) కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజుకు రెండు లక్షలకు తగ్గకుండా  కరోనా కేసులు (Daily Cases) నమోదవుతున్నాయి.

Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్ బారిన పడ్డారంటే..
Corona
Follow us on

దేశంలో కరోనా (C0vid 19) కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజుకు రెండు లక్షలకు తగ్గకుండా  కరోనా కేసులు (Daily Cases) నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health Ministry) విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,86,384 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశం లో  కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,03,71,500 కు చేరింది. కాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్యతో పాటు రోజూవారీ పాజిటివిటీ రేటు పెరగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో  కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య 22,02,472 కు చేరింది. ఇక దేశంలో రోజూ వారి కరోనా పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది.

అదొక్కటే ఊరట..

తాజాగా దేశవ్యాప్తంగా  573 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.  దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,91,700 కి చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,06,357 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దీంతో దేశ వ్యా ప్తంగా  కొవిడ్ రికవరీ ల సంఖ్య 3,76,77,328 కు చేరింది. కేసులతో పాటు రికవరీలు పెరుగుతండడం సానుకూలాంశం. ఇక కరోనా నియంత్రణకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63, 84,39,207 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది . గడిచిన 24 గంటల్లో 22, 35, 267 మందికి టీకా వేసినట్లు పేర్కొంది.

Also Read: Hyderabad: నేడు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలివే..

Krunal vs Deepak Hooda: కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆనాటి గొడవతో లింక్ చేసిన నెటిజన్లు..!

Janhvi Kapoor: టీమిండియా ఆటగాళ్ల దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకుంటోన్న శ్రీదేవి కూతురు.. ఎందుకోసమంటే..