Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ సవిలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజుల నుంచి నిత్యం రికార్డు స్థాయిలో లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 2,73,810 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా గత 24 గంటల్లో (సోమవారం).. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 1,761 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089 (1.53 కోట్లు) కు చేరగా.. మరణాల సంఖ్య 1,80,530 కి పెరిగింది.
నిన్న కరోనా నుంచి 1,54,761 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,31,08,582 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 15,19,486 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 19వ తేదీ వరకు మొత్తం 26,94,14,035 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా నిన్నటి వరకూ దేశంలో 12,38,52,566 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకూ 12,71,29,113 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: