కరోనా ఎఫెక్ట్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన WHO

| Edited By:

Mar 24, 2020 | 8:44 AM

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే పదిహేను వేలమందికి పైగా ప్రాణాలుగోల్పోయారు. మరో మూడున్నర లక్షలకు పైగా వైరస్ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మన దేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 10 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 450 మంది వరకు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. […]

కరోనా ఎఫెక్ట్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన WHO
Follow us on

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే పదిహేను వేలమందికి పైగా ప్రాణాలుగోల్పోయారు. మరో మూడున్నర లక్షలకు పైగా వైరస్ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మన దేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 10 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 450 మంది వరకు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు మైఖేల్ జే ర్యాన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిని అడ్డుకునే సత్తా భారత్‌కు ఉందని.. అన్ని రకాలుగా కరోనాను ఎదుర్కొంటుందన్నారు. గతంలో..భారత్‌లో ప్రబలిన స్మాల్ పాక్స్, పోలియోతో పాటు… పలు అంటువ్యాధులను సమర్ధంగా నిర్మూలించ గల్గిందని మైఖేల్ పేర్కొన్నారు.

అంతేకాదు.. ఈ క్రమంలో పలు సూచనలు కూడా చేశారు. దేశంలో అత్యధిక జనభా ఉన్న నేపథ్యంలో.. కరోనా వైరస్ ప్రబలకుండా పెద్దసంఖ్యలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని గత అనుభవాలతో గుర్తుచేసుకుని.. ఈ మహమ్మారిని వ్యాపించకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.