Covid Vaccine: ఇప్పుడు దేశం విధానం.. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. ఇప్పటివరకు ఎంతమంది టీకా తీసుకున్నారంటే..!

|

May 11, 2021 | 2:49 PM

అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు దేశం విధానం.. టీవీ9 నినాదం. కరోనా మహమ్మారి దేశాన్ని హడలెత్తిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం అంటోంది టీవీ9.

Covid Vaccine: ఇప్పుడు దేశం విధానం.. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. ఇప్పటివరకు ఎంతమంది టీకా తీసుకున్నారంటే..!
Covid 19 vaccine
Follow us on

India Covid Vaccination: అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు దేశం విధానం.. టీవీ9 నినాదం. కరోనా మహమ్మారి దేశాన్ని హడలెత్తిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం అంటోంది టీవీ9.

దేశంలో ఇప్పటి వరకు 17 కోట్ల 17 లక్షల 60 వేల 592 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 13 కోట్ల 55 లక్షల 16 వేల 85 మందికి మొదటి డోస్ అందింది. ఇక 3 కోట్ల 62 లక్షల 44 వేల 507 మందికి రెండో డోస్ కూడా అందింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. వ్యాక్సినేషన్‌కు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోయినా.. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ కోసం క్యూ కడుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 7 లక్షల 95 వేల 542 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. ఇంకా పక్కాగా చెప్పాలంటే మధ్యాహ్నం 12 గంటల్లోపు 4 లక్షల 10 వేల 242 మందికి వ్యాక్సినేషన్ చేశారు వైద్యులు. లక్షా 79 వేల 936 మందికి డోస్‌1 అందగా.. 2 లక్షల 30 వేల 306 మందికి డోస్‌ 2 అందించారు.

Covid Vaccine


ఇక, రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ పూర్తైంది? అందులో మొదటి డోస్ వేసుకున్న వారు ఎంత మంది? రెండో డోస్ వేసుకున్న వారు ఎంత మంది అనే లెక్కలను పరిశీలిస్తే.. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏపీకి 73 లక్షల 49 వేల 960 వ్యాక్సిన్‌ డోసులు రాగా.. ఇప్పటి వరకు 73 లక్షల 460 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు వైద్యులు. అందులో తొలి డోస్‌ తీసుకున్న వారు 53 లక్షల 23 వేల 98 మంది అయితే.. రెండో డోస్‌ కూడా పూర్తి చేసుకున్న వారు 19 లక్షల 77 వేల 362. ఇందులో కోవిషీల్డ్ డోసులు 60 లక్షల 60 వేల 400. కోవ్యాగ్జిన్‌ డోసులు 12 లక్షల 89 వేల 560.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 56 లక్షల వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. 53 లక్షల 13 వేల 900 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తైంది. ఫస్ట్‌ డోస్‌ తీసుకున్న వారి సంఖ్య 44 లక్షల 6 వేల 542. సెకండ్‌ డోస్‌ కూడా పూర్తైన వారి సంఖ్య 9 లక్షల 7 వేల 358. అంటే మరో 3 లక్షల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణకు 46 లక్షల 56 వేల 723 కోవిషీల్డ్ డోసులు రాగా.. 6 లక్షల 57 వేల 177 కోవ్యాగ్జిన్‌ డోసులు వచ్చాయి.

అన్ని రాష్ట్రాలకు ఇప్పటి వరకు 18 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపింది కేంద్రం. మరో 90 లక్షలకుపైగా డోసులు రాష్ట్రాల దగ్గర అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. వచ్చే 3 రోజుల్లో మరో 7 లక్షల డోసులు పంపిణీ చేయనుంది కేంద్రం. జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తోంది.

ఇప్పటి వరకు మొత్తం 19 కోట్ల 88 లక్షల 61 వేల 258 మంది వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో 13 కోట్ల 29 లక్షల 17 వేల 790 మంది 45 ఏళ్ల పైబడిన వారు కాగా.. 6 కోట్ల 59 లక్షల 43 వేల 468 మంది 18 44 ఏళ్ల వయస్సు వారు. 45 ఏళ్ల పైబడిన వారే ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 17 లక్షల 60 వేల 592 మందికి వ్యాక్సినేషన్ చేశారు. అందులో అగ్రభాగం కోవిషీల్డ్ వ్యాక్సిన్లే. ఇప్పటి వరకు అందిన వ్యాక్సిన్‌లలో 15 కోట్ల 49 లక్షల 41 వేల 471 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందింది. ఇక కోటి 68 లక్షల 19 వేల 121 మందికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక యజ్ఞంలా సాగుతోంది.

ఆరోగ్యంగా ఉండాలంటే.. కరోనాకు దూరంగా ఉండాలి. ఆ మహమ్మారి మనల్ని టచ్ చేయవద్దంటే.. వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. అందరికీ వ్యాక్సిన్.. అందిరికీ ఆరోగ్యం స్లోగన్‌ నినదిస్తోంది టీవీ9. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ఆవశ్యకతను మీకు గుర్తు చేస్తోంది. ఇవి దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాక్సినేషన్ లెక్కలు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచుతోంది టీవీ9.

Covid Vaccine


Read Also…  Telangana Lockdown: తెలంగాణ‌లో రేప‌ట్నుంచే లాక్ డౌన్.. తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం