Covid-19 Vaccine: దేశంలో మహాయజ్ఞంలా కొవిడ్ వ్యాక్సినేషన్.. శుక్రవారం ఒక్కరోజే అర కోటికి పైగా..

|

Jul 31, 2021 | 10:45 AM

COVID-19 Vaccine Tracker: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ మహాయజ్ఞంలా సాగుతోంది. శుక్రవారం(జులై 20, 2021) ఒక్కరోజే దేశంలో అరకోటి మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు.

Covid-19 Vaccine: దేశంలో మహాయజ్ఞంలా కొవిడ్ వ్యాక్సినేషన్.. శుక్రవారం ఒక్కరోజే అర కోటికి పైగా..
Covid Vaccine
Follow us on

COVID-19 Vaccine Tracker: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ మహాయజ్ఞంలా సాగుతోంది. శుక్రవారం(జులై 20, 2021) ఒక్కరోజే దేశంలో అరకోటి డోసులకు పైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. దేశంలో నిన్న 52.99 లక్షల వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 46.15 కోట్లకు చేరుకుంది. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 196వ రోజైన శుక్రవారం నాడు 35.40 లక్షల మందికి తొలి డోస్ వ్యాక్సిన్ ఇవ్వగా.. 17.58 లక్షల మందికి సెకండ్ డోస్ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 16న దేశ వ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారిపై పోరులో ముందు వరుసలో నిలుస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు తొలి టీకాను ఇచ్చారు. దేశంలో టీకా కోసం స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న భిక్షగాళ్లు, నిరుపేదలు, అభాగ్యులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను శుక్రవారంనాడు ఆదేశించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల మేరకు దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4,76,08,920 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 2,14,14,837 వ్యాక్సిన్లు ఇచ్చారు. తెలంగాణలో 1,45,85,915 వ్యాక్సిన్లు ఇచ్చారు. గుజరాత్‌లో 3.29 డోసులు, రాజస్థాన్‌లో 3.20 కోట్లు, కర్ణాటకలో 3 కోట్ల డోసులు, పశ్చిమ బెంగాల్‌లో 2.91 కోట్లు, బీహార్‌లో 2.39 కోట్లు, తమిళనాడులో 2.26 కోట్లు, కేరళలో 1.97 కోట్లు, ఒడిశా 1.63 కోట్లు, హర్యానాలో 1.16 కోట్లు, అస్సాంలో 1.05 కోట్లు, ఢిల్లీలో 99.65 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు.

Vaccinate All: అందరికీ ఆరోగ్యం..ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ టీవీ9 నినాదం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని టీవీ9 కోరుతోంది. 

Also Read.

India Coronavirus: దేశంలో కరోనా మృత్యుతాండవం.. పెరుగుతున్న మరణాలు.. నిన్న ఒక్కరోజే..

Nellore: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా చాక్లెట్స్.. ఎగబడ్డ జనం.. చివర్లో ఊహించని ట్విస్ట్

విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటే.. ఆసక్తికరంగా సుమంత్‌ కొత్త సినిమా మళ్లీ మొదలైంది ఫస్ట్‌లుక్‌..