కోవిడ్-19 అప్‌డేట్ : దేశంలో కొత్తగా 41,332 కేసులు, రికవరీ రేటు 93.68 శాతం

|

Nov 28, 2020 | 11:52 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజూ 40 వేలకు పైనే కేసులు వెలుగు చూస్తున్నాయి.  కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌గా తేలింది.

కోవిడ్-19 అప్‌డేట్ : దేశంలో కొత్తగా 41,332 కేసులు, రికవరీ రేటు 93.68 శాతం
Follow us on

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజూ 40 వేలకు పైనే కేసులు వెలుగు చూస్తున్నాయి.  కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 93,51,109కి చేరింది. కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 485 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు మొత్తం 1,36,200 మంది ప్రాణాలు విడచారు. మరోవైపు, యాక్టీవ్ ‌ కేసులు సంఖ్య 4,54,940గా ఉంది. శుక్రవారం మరో 41,452 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 87,59,969గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.68 శాతంగా ఉండగా..డెత్ రేటు 1.46 శాతంగా నమోదైంది. కాగా, శుక్రవారం 11,57,605 నిర్ధారణ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

చలికాలంతో పాటు కొందరు వైరస్‌ను లైట్ తీసుకుని జాగ్రత్తలు తీసుకోవడం లేదని..అందుకే కేసుల  సంఖ్య పెరగిందని నిపుణుల చెబుతున్నారు. ప్రమాదకర వైరస్‌కు ఇంకా సమర్థవంతమైన మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ రాలేదు కాబట్టి సరైన నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Also Read :

హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు.. ముగ్గురు దుర్మరణం

 శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?