India Corona Cases: దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

|

Jul 12, 2021 | 10:11 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 14,32,342 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా..

India Corona Cases: దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
India Corona Updates
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 14,32,342 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 37,154 కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే 10 శాతం మేర కేసులు తగ్గాయి. కొత్తగా  724 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మొత్తం మరణాలు 4,08,764కి చేరాయి.  ఆదివారం 39,649 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తంగా దేశంలో 3 కోట్ల 14 వేల 713 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  దేశంలో ప్రస్తుతం 4,50,899 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  క్రియాశీల రేటు 1.46 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కేసులు, రికవరీల మధ్య గ్యాప్ తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. సెకండ్ వేవ్ వ్యాప్తి ఇంకా ముగియలేదని.. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆంక్షల సడలింపులతో పర్యాటక ప్రదేశాల్లో భారీ జన సమూహాలు దర్శనమివ్వడంపై సర్కార్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం  12,35,287 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫలితంగా  దేశంలో ఇప్పటివరకు 37,73,52,501 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:3,08,74,376
  • మొత్తం మరణాలు: 4,08,764
  • కోలుకున్నవారు: 3,00,14,713
  • యాక్టివ్​ కేసులు: 4,50,899

Also Read: వరుడు వచ్చే మార్గంలో అడ్డుగా కాలువ.. రాత్రికి రాత్రే వెదురు వంతెన నిర్మించిన గ్రామస్తులు

ఆఫీస్‌లో కొలిగ్ కొన్ని సంవత్సరాల క్రితం టిఫిన్ దొంగిలించి తిన్నాడు.. నిజం తెలియగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే