India Corona Cases: దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా యాక్టివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగానే మ‌ర‌ణాలు

|

May 21, 2021 | 10:17 AM

దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రోజువారి పాజిటివ్ కేసుల్లో కూడా స్వల్ప తగ్గుదల క‌నిపిస్తుంది. కొత్త‌గా దేశవ్యాప్తంగా 2,59,591 కరోనా పాజిటివ్..

India Corona Cases: దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా యాక్టివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగానే మ‌ర‌ణాలు
India Corona Updates
Follow us on

దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రోజువారి పాజిటివ్ కేసుల్లో కూడా స్వల్ప తగ్గుదల క‌నిపిస్తుంది. కొత్త‌గా దేశవ్యాప్తంగా 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… మ‌రో 4,209 మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌ర‌ణించారు. ఒక్క మహారాష్ట్రలోనే 984 మంది చనిపోయారు. గురువారం ఒక్క‌రోజే 3,57,295 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,31,991 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 30,27,925 మందికి కొనసాగుతున్న చికిత్స కొన‌సాగుతుంది. కరోనా నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,27,12,735 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,91,331 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 87.25% ఉండ‌గా మరణాల రేటు 1.12% గా ఉంది. ఇప్పటివరకు 19,18,79,503 మందికి కరోనా టీకాలు వేసిన‌ట్లు ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో మరో ప్రమాదకర కరోనా వైరస్ మ్యూటెంట్..

బెంగాల్‌లో శరవేగంగా విస్తరిస్తున్న బి.1.618 రకం కరోనా ఇప్ప‌డు క‌ల‌వ‌ర‌పెడుతంది. దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం అధికంగా ఉన్న‌ట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని యాంటీబాడీస్‌ నుంచి, ప్లాస్మా ప్యానెల్స్ నుంచి తప్పించుకునే శక్తి దీనికుందని అంటున్నారు. ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో ఈ తరహా డబుల్ మ్యుటేషన్లు గుర్తించామ‌ని, భారత్‌లో గుర్తించిన రకం అత్యంత ప్రమాదకారి అంటున్న నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం బెంగాల్‌లో బీ.1.617తో పాటు బీ.1.618 రకం విస్త‌రిస్తున్నాయి. రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ ప్రభావాన్ని దాటి ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుందా అన్న అంశంపై మరిన్ని అధ్యయనాలు కొన‌సాగుతున్నాయి.

 

క‌రోనాకు సంబంధించిన వివ‌రాలు దిగువ వీడియోలో చూడండి…

 

Also Read: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌, గడ్చిరోలిలో ఎదురు కాల్పులు.. 16 మంది మావోయిస్టులు మృతి.!

కృష్ణా జిల్లా పెడనలో విషాదం.. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య