దేశంలో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఊహించనంత వేగంగా పెరుగుతున్నాయి. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. కేసుల సంఖ్య మరింతగా ఎక్కువ అవుతున్నాయి. నిన్న కొత్తగా భారత్‌లో 9971 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య...

దేశంలో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులు

Edited By:

Updated on: Jun 07, 2020 | 11:52 AM

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఊహించనంత వేగంగా పెరుగుతున్నాయి. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. కేసుల సంఖ్య మరింతగా ఎక్కువ అవుతున్నాయి. నిన్న కొత్తగా భారత్‌లో 9971 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,46,628కి చేరింది. అలాగే 24 గంటల్లో 287 మంది చనిపోయారు. ఇంత భారీగా చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6929కి చేరింది. తాజాగా శనివారం 4611 మంది రికవరీ అవ్వడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,19,292గా ఉంది. ప్రస్తుత దేశంలో 1,20,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,22,207 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 69,74,721కి చేరాయి. అలాగే నిన్న 4098 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,02,094కి చేరింది. అలాగే దాదాపు 34.04 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ప్రపంచవాప్త్యంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

Read More:

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వామ్మో.. 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య