తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా నమోదవుతుండగా..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 7:50 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా నమోదవుతుండగా.. శనివారం నాడు ఏకంగా 206 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3496కి చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి.

ఏకంగా 152 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వచ్చాయి. ఇక ఆ తర్వాత రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, మహబూబ్‌నగర్‌లో4 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్‌లో రెండేసి చోప్పున కేసులు నమోదవ్వగా.. మహబూబాబాద్, వికారాబాద్‌, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 123 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని.. 1710 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. 1663 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇక ఏపీ విషయానికొస్తే.. శనివారం ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు న‌మోదు అయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 161 మంది, వ‌ల‌స కూలీలు 41 మంది, ఎన్‌ఆర్ఐలు 8 మంది ఉన్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో న‌మోదైన కేసుల సంఖ్య 4460కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాల‌లో 3588 కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 131 కేసులు, వ‌ల‌స కూలీల 741 కేసులున్నాయి. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 73 మంది మ‌ర‌ణించారు.

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?