భారత్ కుట్రపూరిత చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నా..

|

May 07, 2020 | 10:02 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్ రియాజ్‌ నైకూను మట్టుబెట్టింది. దీనితో పాకిస్తాన్ తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరోసారి భారత్‌పై ఎదురుదాడికి దిగింది. మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్లే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అడ్డుపెట్టుకుని తన దేశానికీ వ్యతిరేకంగా చొరబాట్ల నెపంతో […]

భారత్ కుట్రపూరిత చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నా..
Follow us on

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్ రియాజ్‌ నైకూను మట్టుబెట్టింది. దీనితో పాకిస్తాన్ తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరోసారి భారత్‌పై ఎదురుదాడికి దిగింది. మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్లే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అడ్డుపెట్టుకుని తన దేశానికీ వ్యతిరేకంగా చొరబాట్ల నెపంతో భారత్ తప్పుడు ఆపరేషన్స్ చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

కాశ్మీర్‌లో అశాంతి నెలకొనడానికి కారణం పాకిస్తాన్ అంటూ భారత్ చెబుతోందని.. దాని ద్వారానే ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిందని ట్వీట్ చేశారు. “పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు అజెండా ఆపరేషన్లతో భారతదేశం నిరంతరం చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాను. నియంత్రణ రేఖ వెంబడి ‘చొరబాటు’ భారత్ చేసే ఆరోపణలు నిరాధారమైనవని.. భారత ప్రమాదకరమైన ఎజెండాకు ఇది కొనసాగింపు”అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల దక్షిణ ఆసియాలో అశాంతి నెలకొందని ఆయన విమర్శించాడు.

Read This: వైజాగ్ గ్యాస్ లీకేజ్ బాధితులకు ఆరోగ్య శ్రీ అండ..