వైజాగ్ గ్యాస్ లీకేజ్ బాధితులకు ఆరోగ్య శ్రీ అండ..

విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. బాధితులందరికీ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చెయ్యాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఆయన అన్నారు. విశాఖతో పాటు గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనైనా కూడా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చునన్నారు. ఆస్పత్రిలో చేరిన వారి ఆధార్ కార్డ్ , వివరాలు, మెడికల్ బిల్లులను ఆరోగ్య శ్రీకి […]

వైజాగ్ గ్యాస్ లీకేజ్ బాధితులకు ఆరోగ్య శ్రీ అండ..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 07, 2020 | 8:10 PM

విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. బాధితులందరికీ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చెయ్యాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఆయన అన్నారు. విశాఖతో పాటు గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనైనా కూడా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చునన్నారు. ఆస్పత్రిలో చేరిన వారి ఆధార్ కార్డ్ , వివరాలు, మెడికల్ బిల్లులను ఆరోగ్య శ్రీకి పంపితే చాలని.. మొత్తం ఖర్చులన్నీ కూడా ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చెల్లిస్తుందన్నారు. అటు బాధితులు సాయం కోసం హెల్ప్ డెస్క్‌ నెంబర్ 8333814019ను సంప్రదించాలని సూచించారు.

కాగా, ఒకవైపు కరోనాతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే.. ఇవాళ విశాఖపట్నంలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజ్ దుర్ఘటన తెలుగు ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆ కంపెనీ నుంచి వెలువడిన స్టెరీన్‌ వాయువు కారణంగా సుమారు ఐదు గ్రామాల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో పదకొండు మంది మరణించగా.. మొత్తంగా 316 విశాఖ, ఆ చుట్టుప్రక్కల ఉన్న వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Read This: కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!