
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు మందు తయారీకి అన్ని దేశాలు విస్రృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి 54వేల మందిని పొట్టనబెట్టుకుంది. మరో 11లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో దీనికి వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డారు మనవాళ్లు ఇండియన్స్ కూడా. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (DBT), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(DST), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(DAE)లకు చెందిన లాబరేటరీలో ఈ కరోనా వ్యాక్సిన్ కోసం పరీక్షలు చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి అనుమతులిచ్చింది. అయితే ఈ టెస్టులు చేస్తున్న సందర్భంగా ICMR నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్ని లాబరేటరీలకు సూచించింది. కాగా.. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన టీకా.. టెస్టింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు చైనా, అమెరికాలు కూడా వ్యాక్సిన్ కనుగొనే దిశలో ముందున్నారు.