ఈ-పాస్ ఎలా తీసుకోవాలి? ఈ వీడియో చూడండి..

| Edited By:

Apr 20, 2020 | 7:41 PM

ఈ-పాస్ ఎలా తీసుకోవాలనేదానిపై ప్రత్యేకంగా ఓ వీడియో కూడా రూపొందించి విడుదల చేసింది టీఎస్ పోలీస్ శాఖ. ఈ-పాస్ కావాలంటే ముందుగా వీడియోలో తెలిపినట్లుగా వెబ్‌సైట్‌లోకి...

ఈ-పాస్ ఎలా తీసుకోవాలి? ఈ వీడియో చూడండి..
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి, కఠిన చర్యలు అమలు పరుస్తున్నా కూడా వైరస్ ప్రబలుతూనే ఉంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ మే 7వ తేదీ వరకూ పొడిగించారు సీఎం కేసీఆర్. అలాగే ఏవైనా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని సీఎంతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా తెలిపారు. అయితే ఇంతకీ ఈ-పాస్ ఎలా తీసుకోవాలి? ఇప్పటివరకూ బయటకి వెళ్తే.. ఏదో ఒకటి చెప్పి తిరిగేశారు కానీ.. ఇప్పటినుంచి మాత్రం కాలు బయట పెట్టాలంటే పాస్ తీసుకోవాల్సిందే.

ఇందు కోసం పోలీస్ శాఖ ఓ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఈ-పాస్ ఎలా తీసుకోవాలనేదానిపై ప్రత్యేకంగా ఓ వీడియో కూడా రూపొందించి విడుదల చేసింది. ఈ పాస్ కావాలంటే ముందుగా వీడియోలో తెలిపినట్లుగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీరు దేని కోసం బయటకు వెళ్తున్నారో ఆ డీటైల్స్ అప్లికేషన్‌ ఫామ్‌‌లో నింపాలి. ఆ తర్వాత దానికి ఫొటో, ఆధార్ కార్డ్ అటాచ్ చేయాలి. పది నిమిషాల్లో దాన్ని స్పెషల్ బ్రాంచి పోలీసులు అప్రూవ్ చేస్తారు. ఇది మన ఫోన్ నెంబర్‌కి మెసేజ్ కూడా వస్తుంది. ఆ తర్వాత లింక్ ఓపెన్ చేసి ఫామ్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోను చూడండి.

Read More: 

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా

లాక్‌డౌన్: టీఎస్ పోలీసుల న్యూ రూల్స్.. రేపట్నుంచి కఠినంగా అమలు