కరోనాతో జాగ్రత్త.. ఇంటి నుంచి బయటకు వెళ్లకండంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో రకుల్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల మేమందరం.. షూటింగ్స్ ఆపేసి ఇంట్లోనే ఉన్నాం. అలాగే మీరందరూ కూడా బావుండాలని కోరుకుంటున్నా. ప్లీజ్ అందరూ గవర్నమెంట్స్ ఇచ్చిన ప్రికాషన్స్‌ని ఫాలో అవ్వండి. చేతులను శుభ్రంగా కడుక్కోండి. ఇంట్లోనే ఉండండి.. అస్సలు బయటకు వెళ్లకండి. సెల్ఫ్ జోన్‌లో ఉండండి. ఆఫీసులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా అని.. బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌తో కలవడం కాదు.. ఇంట్లోనే జాగ్రత్తగా మీ పనులు చేసుకోండి. మంచి ఫుడ్ తీసుకుని.. మీ ఇమ్యునిటీని కాపాడుకోండి. అలాగే.. బయట ట్రాన్స్‌పోర్టును ఎంకరేజ్ చేయకండంటూ.. వీడియో చేసి అభిమానులకు షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
ప్రపంచమంతా విశ్వరూపం చూపిస్తోన్న కరోనా.. ఇండియాలో కూడా విజృంభిస్తోంది. తాజగా 138 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే దాదాపు 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రజలకు పలు సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు. అలాగే కరోనా వ్యాప్తి చెందకుండా.. స్కూల్స్, కాలేజీలు, థియేటర్లతో పాటు పలు షాపింగ్ మాల్స్ కూడా మూసివేశాయి ప్రభుత్వాలు.
Read More this also:
కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు
హీరోయిన్ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..
దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం!
ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి