భారత్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది. రోగుల కోసం వైద్య సిబ్బంది అనునిత్యం శ్రమిస్తున్నారు. మరోవైపు కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో ఆస్పత్రుల, వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయినా రోగుల్లో మనోధైర్యం నింపేందుకు వైద్యారోగ్యసిబ్బంది చిరునవ్వుతో శ్రమిస్తున్నారు. వైరస్ సోకే ముప్పు ఉన్నా సిబ్బంది ఆ భయాన్ని పక్కనపెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ రోగుల్లో
ఉత్సాహం నింపేందుకు హెల్త్ కేర్ సిబ్బంది ఆడిపాడారు. రోగులను సంతోషపరచటానికి వైద్య సిబ్బంది ఓ పంజాబీ పాటకు ఆడిపాడిన వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పీపీఈ కిట్లు ధరించిన డాక్టర్లు, ఇతర సిబ్బంది రోగులతో కలిసి పంజాబీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. కొందరు రోగులు చప్పట్లు కొడుతూ బెడ్ పైనే భాంగ్రా స్టెప్పులను అనుకరించారు. గుర్మీత్ చద్దా అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు.
Amazing spirit. Salute Our doctors & healthcare warriors!
Brought a smile ..
PS- beautiful song as well ( fwd)@deepaksidhu pic.twitter.com/M53pPTyJqw
— Gurmeet Chadha (@connectgurmeet) April 28, 2021