కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి కాటుకు దేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు మరణించారు. మరికొంత మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. హర్యానాకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనా బారిపడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సుభాష్ సుధా గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను శనివారం నాడు గుర్‌గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆదివారం నాడు రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక అధికారులు ఆ ఎమ్మెల్యేను కలిసిన వారి కాంటాక్ట్ ట్రేస్ చేస్తున్నారు. కాగా, హర్యానాలో ఇప్పటి వరకు 13వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 200కు పైగా కరోనా బారినపడి మరణించారు.