దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు వందల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు వేలకు వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుజరాత్ కూడా ఇరవై వేల మార్క్‌ను దాటేసింది. ఆదివారం నాడు కొత్తగా మరో 511 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,590కి చేరింది. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 29 మంది కరోనా బారినపడి మరణించారని.. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1478కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,922 కి చేరింది. అంతేకాదు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య తొమ్మిదివేలు దాటింది.