Case On Police Officers: సాధారణంగా చట్టాలను పరిరక్షించేవారికి పోలీసులు అంటారు. అలాంటి పోలీసులే చట్టాన్ని అతిక్రమించిన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించిన సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. ఈ సంఘటన గుజరాత్‌లోని కుచ్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కుచ్ జిల్లాకు చెందిన స్థానిక క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన కొందరు పోలీసులు ఫామ్‌హౌజ్‌లో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్‌తో పాటు బాణా సంచాలను కాలుస్తూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన అధికారులు.. ఎస్ఐతో పాటు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అంజార్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఐదురుగు పోలీసులు ఉన్నారు. వీరిపై సెక్షన్ 269పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు సాయం పంపిణీకి డేట్ పిక్స్
Telangana: నకిలీ విత్తనాలతో రైతులను ముంచితే, పీడి యాక్టులు.. తెలంగాణ పోలీసుల సీరియస్ వార్నింగ్
Special Vaccination: గ్రేటర్ హైదరాబాద్‌లో రెండో రోజు ఫుల్ సక్సెస్.. 22,399 మందికి వాక్సిన్