తిరుపతి వేద‌పాఠ‌శాల విద్యార్థులకు కరోనా నెగటివ్

తిరుమ‌ల‌లోని వేద‌పాఠ‌శాల విద్యార్థుల‌కు క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌నే ఆందోళ‌న మొద‌లైంది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన నిర్వాహ‌కులు, అధికారులు విద్యార్థుల‌ను హుటాహుటిన వారిని క్వారంటైన్‌కి త‌ర‌లించి, వైద్య ప‌రీక్ష‌లు చేయించారు.

తిరుపతి వేద‌పాఠ‌శాల విద్యార్థులకు కరోనా నెగటివ్
Follow us

|

Updated on: Apr 09, 2020 | 2:40 PM

తిరుమ‌ల‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. బుధ‌వారం తిరుమ‌ల‌లోని వేద‌పాఠ‌శాల విద్యార్థుల‌కు క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌నే ఆందోళ‌న మొద‌లైంది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన నిర్వాహ‌కులు, అధికారులు విద్యార్థుల‌ను హుటాహుటిన వారిని క్వారంటైన్‌కి త‌ర‌లించి, వైద్య ప‌రీక్ష‌లు చేయించారు. ఐదుగురు వేద పాఠ‌శాల విద్యార్థులు, ఇద్ద‌రు పంతుళ్ల న‌మూనాల‌ను సేక‌రించి టెస్ట్‌ల‌కు పంపించారు. కాగా ఈ రోజు వారి రిపోర్ట్స్ నెగేటివ్‌గా వ‌చ్చాయి.
స్విమ్స్ లో జాయిన్ చేసిన  తిరుపతి వేద పాఠశాల విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యాయి. ఐదుగురు విద్యార్థులు తో పాటు ఇద్దరు టీచర్స్ కి ముందు జాగ్రత్తగా చేసిన కరోనా టెస్ట్ లో నెగటివ్ రిపోర్ట్ వచ్చింది.. దీంతో టీటీడీలో ఆనందం వ్యక్తమైంది. దగ్గు, జలుబు తో బాధపడుతోన్న విద్యార్థికి అత్యంత సాధారణ అనారోగ్యంగా గుర్తించారు.. ఎలాంటి నిర్లక్ష్యానికి, అవాంఛనీయ సంఘటనకు తావివ్వకూడదనే ముందస్తు పరీక్షలు నిర్వహింపచేశామని టీటీడీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఎటువంటి వైర‌స్ ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.