ఇక‌పై 12గంట‌ల షిఫ్ట్స్ !- చట్టాల్లో మార్పునకు కేంద్రం యోచన

|

Apr 15, 2020 | 2:57 PM

కరోనా వైరస్ ను దేశంలో వేగంగా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా మూతబడిన ముఖ్యమైన పరిశ్రమలను తెరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే ..

ఇక‌పై 12గంట‌ల షిఫ్ట్స్ !- చట్టాల్లో మార్పునకు కేంద్రం యోచన
Follow us on

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదిరించ‌లేక ప్ర‌పంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. భార‌త్‌లోనూ గ‌త మూడు వారాలుగా బంద్ కొన‌సాగుతోంది. వ్యాపార‌, వాణిజ్యాలు, విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎన్నాడూ చూడ‌ని న‌ష్టాల‌ను చ‌విచూస్తోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి ఏ విధంగా నిల‌బెట్టాల‌నే యోచ‌న‌లో కేంద్రం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది.

కరోనా వైరస్ ను దేశంలో వేగంగా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా మూతబడిన ముఖ్యమైన పరిశ్రమలను తెరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే కార్మికుల కొరత సమస్య తలెత్తడంతో కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషి స్తోంది. సొంత ఊర్లకు వెళ్ళిన కార్మికులు లాక్ డౌన్ కారణంగా పరిశ్రమల కు చేరుకునే అవకాశం లేదు గనుక అందుబాటులో ఉన్న కార్మికులతో నే పూర్తిస్థాయి ఉత్పత్తిని సాధించడానికి అవసరమైతే కార్మిక చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఏప్రిల్ 20 తరువాత కొన్ని పరిశ్రమలను తెరిస్తే  పనిచేసేందుకు వచ్చే ఉద్యోగులు – కార్మికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో డిమాండ్ కు తగినట్టుగా  సరఫరా కష్టమౌతుంది.  ఈ కారణంగా కార్మిక చట్టం లో మార్పు తీసుకువచ్చి, రోజుకి 8 గంటలకి బదులుగా 12 గంటలకు పని వేళలను పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మిక చట్టం ప్రకారం రోజుకి 8 గంటల చొప్పున వారానికి 48 గంటలకి మించి పని చేయించరాదనే  నిబంధన ఉంది. అయితే అత్యవసర సమయంలో వారానికి పని గంటలు 72 గంటలకి పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను కేంద్రం తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. ఫలితంగా మూడు షిఫ్ట్ లకు బదులుగా రెండు షిఫ్ట్ ల్లోనే పనులను పూర్తిచేసే అవకాశం లభిస్తుంది.