పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

| Edited By:

Jun 25, 2020 | 2:24 PM

ఏపీలో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు (ట్రాక్) తప్పింది. దీంతో వంతెన పై నుంచి పడింది. ఈ ప్రమాదంలో ట్రైన్‌తో పాటు వస్తోన్న నాలుగు ఆయిల్ ట్యాంకర్లు దగ్ధమయ్యాయి. ఈ యాక్సిడెంట్ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సురారెడ్డిపాలెం దగ్గర జరిగింది. నాయుడుపాలెం-బాపూజీ నగర్ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న నాలుగు...

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..
Follow us on

ఏపీలో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు (ట్రాక్) తప్పింది. దీంతో వంతెన పై నుంచి పడింది. ఈ ప్రమాదంలో ట్రైన్‌తో పాటు వస్తోన్న నాలుగు ఆయిల్ ట్యాంకర్లు దగ్ధమయ్యాయి. ఈ యాక్సిడెంట్ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సురారెడ్డిపాలెం దగ్గర జరిగింది. నాయుడుపాలెం-బాపూజీ నగర్ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న నాలుగు డీజిల్ బోగీలు విడిపోయాయి. ట్రాక్ కుంగిపోవడంతో పట్టాలను విడిపోయిన రైలు బోగీలు వంతెన పై నుంచి ఒక్కసారిగా కింద పడ్డాయి. ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా కిందపడటంతో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్, గార్డులు వెంటనే సమీప రైల్వే స్టేషన్‌కి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ యాక్సిడెంట్‌లో నాలుగు డీజిల్ ట్యాంకర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ఈ గూడ్స్ రైలు విజయవాడ నుంచి చెన్నై వెళ్తోంది.

అయితే ఈ ప్రమాదం కారణంగా రైల్వే ట్రాక్ దాదాపు 200 మీటర్లు మేర ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు 80 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా ట్యాంకర్లు మంటల్లో కాలిపోవడంతో పాటు బోగీలు పట్టాలపై ఉండటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటనే మరమ్మత్తుల చేపట్టి.. సింగిల్ ట్రాక్‌పై రైళ్లను నడిపించారు అధికారులు.

Read More: 

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

పెట్రోల్ ధరల మోత.. వాహనదారులకు ఝలక్..