లాక్ డౌన్ కాలం.. ఇళ్లలోనే ఉండేలా చూసేందుకు ‘దయ్యాల్లా.’ వెరైటీ ప్రయోగం

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో 'కెపు'  గ్రామస్థులు లాక్ డౌన్ ని భలే వెరైటీగా పాటిస్తున్నారు. ముఖ్యంగా రాత్రుళ్ళు లాక్ డౌన్

లాక్ డౌన్ కాలం.. ఇళ్లలోనే ఉండేలా చూసేందుకు దయ్యాల్లా. వెరైటీ ప్రయోగం

Edited By:

Updated on: Apr 13, 2020 | 7:57 PM

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ‘కెపు’  గ్రామస్థులు లాక్ డౌన్ ని భలే వెరైటీగా పాటిస్తున్నారు. ముఖ్యంగా రాత్రుళ్ళు లాక్ డౌన్ ని పట్టించుకోకుండా వీధుల్లోకి వచ్ఛేవారినిభయపెట్టేందుకు కొందరికి ‘దయ్యాల’ వేషాలు వేసి వారి చేత గస్తీ కాయిస్తున్నారు. ‘పోకాంగ్’ అనే పేరిట కొందరు స్థానికులే తెల్లటి పొడవాటి బట్టలు ధరించి.. ముఖాలకు తెల్లని  పౌడర్ దట్టించి.. ఇలా కనబడుతూ.. లాక్ డౌన్ ఉల్లంఘనకారులను పరుగులు తీయిస్తున్నారు. వీరిని చూసి జడుసుకుని బయటకు రాకుండా చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారట. లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా.. కరోనాను ఇప్పుడే కట్టడి చేయకపోయినట్టయితే మే నెల నాటికి లక్షా నలభై వేల మంది కరోనా కాటుకు గురి కావచ్ఛునని, పైగా కరోనా కేసులు లక్షన్నర దాటవచ్చునని ఇండోనేసియా యూనివర్సిటీ అంచనా వేస్తోంది. ఈ దేశంలో 4,241 కరోనా కేసులు నమోదు కాగా.. 373 మంది కరోనా రోగులు మరణించారు.