కరోనాతో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే మృతి

| Edited By:

Aug 19, 2020 | 9:59 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. ఇక ఈ కరోనా మహమ్మారి బారినపడి సామాన్య ప్రజానీకంతో పాటు.. ప్రజాప్రతినిధులు కూడా..

కరోనాతో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే మృతి
Follow us on

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. ఇక ఈ కరోనా మహమ్మారి బారినపడి సామాన్య ప్రజానీకంతో పాటు.. ప్రజాప్రతినిధులు కూడా మరణిస్తున్నారు. తాజాగా.. కర్ణాటక రాష్ట్రంలో కరోనా బారినపడి ఓ మాజీ ఎమ్మెల్యే మరణించారు. మాజీ ఎమ్మెల్యే సీ గురుస్వామి క‌రోనా మ‌హ‌మ్మారితో
మరణించారు. ఆయన వయస్సు 68 ఏళ్లు. ఆగ‌స్టు 5వ తేదీన ఆయ‌న‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఆయన్ను మైసూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతుండ‌గా బుధ‌వారం ఉద‌యం గుండెపోటు రావ‌డంతో మరణించారు. సీ గురుస్వామి గ‌తంలో చామ‌రాజ‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌ర్ణాట‌క అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం