Coronavirus: మూగ జీవాల పాలిట ప్రమాదకరంగా మారుతోన్న కరోనా అల్ఫా వెరియంట్‌.. తొలిసారిగా..

|

Nov 05, 2021 | 6:46 PM

Coronavirus: కంటికి కనిపించని కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని ఎంతలా భయాబ్రాంతులకు గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైద్య రంగంతో పాటు ఆర్థిక వ్యవస్థలను సైతం ఈ వైరస్‌ నాశనం చేసింది. ప్రపంచానికి పెద్దన్నలాంటి..

Coronavirus: మూగ జీవాల పాలిట ప్రమాదకరంగా మారుతోన్న కరోనా అల్ఫా వెరియంట్‌.. తొలిసారిగా..
Corona In Dogs
Follow us on

Coronavirus: కంటికి కనిపించని కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని ఎంతలా భయాబ్రాంతులకు గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైద్య రంగంతో పాటు ఆర్థిక వ్యవస్థలను సైతం ఈ వైరస్‌ నాశనం చేసింది. ప్రపంచానికి పెద్దన్నలాంటి అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ వైరస్‌ దాటికి చిగురుటాకులా వణికిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆక్సిజన్‌ అందక మరణించిన హృదయ విదాయకర దృశ్యాలు కనిపించాయి. ఇదిలా ఉంటే కోవిడ్‌ 19 కేవలం మనుషులకే పరిమితం కాకుండా మూగ జీవాలను సైతం వదల్లేదు. చాలా ప్రాంతాల్లో మూగజీవాలకు కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కోవిడ్‌ 19 పెంపుడు జంతువులకు సోకుతుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జంతువుల్లో తొలిసారి ఆల్ఫవెరియెంట్‌ను గుర్తించారు యూకేకు చెందిన శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పెంపుడు శునకాలు, పిల్లుల్లో ఈ వేరియంట్‌ను కనుగొన్నారు. ఇది మూగ జీవాల పాలిట పెను ప్రమాదంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్‌ కారణంగా మూగ జీవుల గుండెపై తీవ్ర ప్రభావం (గుండె కండరాల్లో వాపు) చూపుతుందని, వాటి అకాల మరణానికి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. వెటర్నరీ రికార్డ్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. మొట్టమొదటిసారి ఈ సార్స్‌ కోవ్‌-2 ఆల్ఫా వెరియంట్‌ను రెండు పిల్లులు, ఒక శునకంలో గుర్తించారు.

ఈ మూగ జీవులు గుండె సంబంధిత వ్యాధి బారిన పడిన తర్వాత చేసిన పీసీఆర్‌ టెస్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. అయితే జంతువులకు కరోనా సోకే కంటే కొన్ని వారాల మందు వాటి యజమానులకు కరోనా సోకినట్లు పరిశోధనల్లో తేలింది. గతంలో జంతువుల్లో గుర్తించిన వైరస్‌ కంటే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే చాలా వరకు జంతువులు మనుషులతో సన్నిహితంగా ఉండడం వల్లే వైరస్‌ సోకినట్లు నిపుణులు గుర్తించారు. తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం.. పిల్లులు, రాకూన్‌ శునకాలు, జింకలతో పాటు మరికొన్ని మూగ జీవాలకు వైరస్‌ సోకినట్లు తేలింది. ఇదిలా ఉంటే జంతువుల్లో కోవిడ్‌ 19 సోకడం అనేది అరుదైన సంఘటనల్లోనే జరుగుతుందని, జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ సోకే అవకాశాలకంటే మనుషుల నుంచి జంతువులకు వైరస్‌ సంక్రమణకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: T20 World Cup 2021, IND vs SCO: స్కాట్లాండ్‌తో తలపడే ప్లేయింగ్ XIలో కీలక మార్పు? ఆ బౌలర్‌కి షాకివ్వనున్న కోహ్లీ.. కారణం ఇదే..!

విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్

Video Viral: వార్నీ.. ఈ కోడి మాముల్ది కాదు.. కాపీ కొట్టడంలో నెంబర్ వన్.. ఫన్నీ వీడియో మీకోసం..