Maharashtra: కోవిడ్ నిబంధనలు పాటిస్తారా.. లేక మరో లాక్‌డౌన్‌ను ఎదుర్కొంటారా..? సీఎం ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్ 

|

Feb 17, 2021 | 1:28 AM

CM Uddhav Thackeray: మహారాష్ట్రలో నిత్యం పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, అందరూ..

Maharashtra: కోవిడ్ నిబంధనలు పాటిస్తారా.. లేక మరో లాక్‌డౌన్‌ను ఎదుర్కొంటారా..? సీఎం ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్ 
Follow us on
CM Uddhav Thackeray: మహారాష్ట్రలో నిత్యం పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, అందరూ మార్గదర్శకాలను పాటించాలంటూ ప్రభుత్వం వెల్లడిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని లేకపోతే మరో లాక్‌డౌన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని, అయితే ప్రజలెవరూ జాగ్రత్తలు తీసుకోవడం మానవద్దని సూచించారు.
కరోనా నిబంధనలను ప్రజలు కఠినంగా పాటించాలని, లేదంటే మరోసారి లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కావాలా.. లేక కొన్ని ఆంక్షలతో స్వేచ్ఛగా జీవించాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. క్రమం తప్పకుండా మాస్కులు ధరించాలని.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆయన సూచించారు. లేదంటే మరోసారి లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందంటూ అభిప్రాయపడ్డారు.
Also Read:

Night curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూ.. మెట్రో నగరాల్లో నెలాఖరు వరకు పెంచిన గుజరాత్ ప్రభుత్వం.. ఎందుకంటే..?

85 లక్షలు దాటిన కరోనా వ్యాక్సిన్ లబ్ధిదారుల సంఖ్య.. టీకా తీసుకున్న అనంతరం 35 మందే ఆసుపత్రుల్లో చేరారు: కేంద్రం