కోవిడ్ బాధితుల ఫిర్యాదులపై తెలంగాణ సర్కార్ వేగంగా స్పందిస్తోంది. మరో ఐదు ఆస్పత్రులపై వేటు వేసింది. కొవిడ్ చికిత్సలకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా 27 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఐదు ఆస్పత్రులకు కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసింది.
ఇందులో ప్రముఖ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. వీటిలో.. అమీర్‌పేట్ ఇమేజ్ ఆస్పత్రి, ఎల్‌బీ నగర్‌లోని అంకుర, కొండాపూర్‌లోని సియాలైఫ్, షాపూర్‌నగర్‌లోని సాయి సిద్ధార్థ, భూత్‌పూర్‌లోని పంచవటి ఆస్పత్రులకు అనుమతి రద్దు చేశారు.
దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం రాష్ట్రంలో 10 ఆస్పత్రుల రద్దు చేసినట్లు అయింది. ఇటీవలే ఐదు ఆస్పత్రుల అనుమతులను రద్దు చేసిన ప్రభుత్వం.. 64 దవాఖానాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.