ఏడు రోజులపాటు మూతపడనున్న ఫిష్ మార్కెట్‌

లాక్‌డౌన్‌ 4.0 దాదాపు అన్నింటికి వెసులు బాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఇక నిత్యవసర సరుకులతో పాటు.. మాంసాహార మార్కెట్లు కూడా గతం నుంచి ఓపెన్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఏడు రోజులపాటు మూతపడనున్న ఫిష్ మార్కెట్‌

Edited By:

Updated on: Jun 12, 2020 | 3:46 PM

లాక్‌డౌన్‌ 4.0 దాదాపు అన్నింటికి వెసులు బాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఇక నిత్యవసర సరుకులతో పాటు.. మాంసాహార మార్కెట్లు కూడా గతం నుంచి ఓపెన్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మార్కెట్లకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా.. కరోనా మాత్రం ఇవ్వడం లేదు. మార్కెట్లో ఉన్న వ్యాపారస్థులకు కరోనా సోకడంతో.. ఆ మార్కెట్ పరిసరాల్లో కనీసం రెండు రోజులు మూతపడుతున్నాయి.

తాజాగా వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలో ఓ హోల్‌సేల్‌ ఫిష్ మార్కెట్‌ వారం రోజుల పాటు మూతపడనుంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. డార్జిలింగ్ జిల్లా మెజిస్ట్రేట్‌ సిలిగురిలోని హోల్‌సేల్ ఫిష్ మార్కెట్‌ను వారం రోజులపాటు మూసేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో అక్కడి వ్యాపారస్థులు ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజులపాటు చేపలను నిల్వా ఉంచడం పెద్ద సమస్యగా మారుతుందని.. మార్కెట్‌లోని ఓ వ్యాపారి వాపోయాడు. ఇక్కడి నుంచి చేపలను బీహార్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేస్తారు.