Nasal Vaccine: ముక్కు ద్వారా వేసే ఈ వ్యాక్సిన్‌‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్.. రెండో దశ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చిన కేంద్రం

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (నాజల్‌ వ్యాక్సిన్‌)కు ఒకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం.

Nasal Vaccine: ముక్కు ద్వారా వేసే ఈ వ్యాక్సిన్‌‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్.. రెండో దశ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చిన కేంద్రం
First Nasal Vaccine Developed By Bharat Biotech

Updated on: Aug 13, 2021 | 8:09 PM

Bharat Biotech Nasal Vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని నియంత్రించేందుకు మరో ముందడుగు పడింది. త్వరలో మరో మందు అందుబాటులోకి రానుంది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (నాజల్‌ వ్యాక్సిన్‌)కు ఒకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే మరో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అనుమతించినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయసుల వారిపై నిర్వహించిన తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయ్యినట్లు తెలిపింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ‘కొవాగ్జిన్‌’ టీకాను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ.. ముక్కు ద్వారా ఇచ్చే టీకా (బీబీవీ154- అడెనోవైరస్‌ వెక్టార్డ్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌) అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇందు కోసం గతేడాది సెప్టెంబరులో భారత్‌ బయోటెక్‌, యూఎస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. కాగా, ప్రపంచలోనే తొలిసారి ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌ బయెటెక్‌ అభివృద్ధి చేస్తోంది. దీంతో రెండు, మూడో దశ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Read Also…  Fever: వణికిస్తోన్న విష జ్వరాలు.. సీజనల్ వ్యాధులకు తోడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ముప్పేటదాడి, జనం విలవిల

Fever: వణికిస్తోన్న విష జ్వరాలు.. సీజనల్ వ్యాధులకు తోడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ముప్పేటదాడి, జనం విలవిల