శ్రీశైలం ఆలయంలో మొదటి కరోనా కేసు..

| Edited By: Pardhasaradhi Peri

Jul 07, 2020 | 12:37 PM

శ్రీశైలం దేవస్థానంలో, సున్నిపెంట గ్రామంలో మొట్ట మొదటిసారిగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ గార్డ్, అలాగే మరొకరు సున్నిపెంట లంబాడి తండాకు చెందిన వ్యక్తికి...

శ్రీశైలం ఆలయంలో మొదటి కరోనా కేసు..
Follow us on

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే పలు ప్రముఖ ఆలయాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో పలు ఆలయాలు కూడా మూసివేశారు. తాజాగా శ్రీశైలం ఆలయంలో మొదటిసారిగా ఓ కరోనా కేసు నమోదయ్యింది.

శ్రీశైలం దేవస్థానంలో, సున్నిపెంట గ్రామంలో మొట్ట మొదటిసారిగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ గార్డ్‌, అలాగే మరొకరు సున్నిపెంట లంబాడి తండాకు చెందిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక వెంటనే వీరిద్దరినీ అధికారులు కర్నూలు ఐసోలేషన్ వార్డుకు పంపించారు. ఇక శ్రీశైలం ఆలయంలో మొత్తం శానిటైజ్ చేశారు. అలాగే సెక్యూరిటీతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారన్న దానిపై దేవస్థానం అధికారులు ఆరా తీస్తున్నారు.

Read More:

తెలంగాణ కొత్త సచివాలయ నమూనా విడుదల..

మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కన్నుమూత