చెన్నై ప్రభుత్వాసుపత్రిని కుదిపేస్తున్న కరోనా.. ఏకంగా

| Edited By:

Jun 14, 2020 | 10:42 AM

చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రిని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు సహా మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా సోకింది.

చెన్నై ప్రభుత్వాసుపత్రిని కుదిపేస్తున్న కరోనా.. ఏకంగా
Follow us on

చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రిని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు సహా మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా సోకింది. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న మొత్తం 55 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మరోవైపు ఆసుపత్రి డీన్‌కి కరోనా లక్షణాలు ఉండటంతో ఆయనను మారుస్తూ ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కరోనా వైరస్ నివారణకు ఇప్పటికే చెన్నై నగరంలో మైక్రోసిస్టమ్‌ని ప్రకటించింది సర్కార్. ఈ క్రమంలో 15 మండలాల్లో 200 మంది ప్రత్యేక వైద్యులు ,11 ,500 తో కూడిన మెడికల్ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉంటే కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలోని ముఖ్యమైన వైద్యులు, మంత్రులతో ఆ రాష్ట్ర సీఎం పళని స్వామి సోమవారం అత్యవసర భేటీని నిర్వహించబోతున్నారు. కాగా తమిళనాడులో నమోదైన కరోనా కేసుల సంఖ్య 40వేలను దాటేసింది. అందులో 22వేలకు పైనే కోలుకోగా.. మరణాల సంఖ్య 300 దాటేసింది. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు నాలుగో స్థానంలో ఉంది.

Read This Story Also: రెహమాన్‌పై కమల్ కీలక వ్యాఖ్యలు