క‌రోనా వ్య‌ధ‌లు.. కృష్ణా జిల్లాలో దారుణం.. మృత‌దేహాన్ని ఆస్ప‌త్రిలోనే వ‌దిలేసిన వైనం

|

May 03, 2021 | 2:43 PM

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. పలు జిల్లాలో ఆక్సిజన్‌ అందక సంభవించిన మరణాలు ప్రజల్లో గుండెల్లో భయం పుట్టిస్తున్నాయి.

క‌రోనా వ్య‌ధ‌లు.. కృష్ణా జిల్లాలో దారుణం.. మృత‌దేహాన్ని ఆస్ప‌త్రిలోనే వ‌దిలేసిన వైనం
Crowded In Mortuary With Corona Deaths
Follow us on

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. పలు జిల్లాలో ఆక్సిజన్‌ అందక సంభవించిన మరణాలు ప్రజల్లో గుండెల్లో భయం పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ జరుగుతున్న సంఘటనలు భయంతో పాటు, ఆవేదనను కలిగిస్తున్నాయి. కరోనా వస్తే సొంతవాళ్లే పట్టించుకోని వైనం.. చనిపోతే శవాన్ని అనాథగా వదిలేస్తున్న తీరు కలచివేస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీరులపాడు మండలం కొనతాల పల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల కోట మార్తమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆస్పత్రి సిబ్బంది మార్తమ్మకు ముందుగా కరోనా టెస్ట్ చేశారు. రిపోర్ట్ వచ్చే లోగా ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే ఆమె మృతిచెందింది. కరోనాతోనే మృతి చెందిందని భావించిన కుటుంబసభ్యులు మార్తమ్మ మృతదేహాన్ని హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్లిపోయారు.

మార్తమ్మ చనిపోయి 24 గంటలు గడిచిపోయినా ఎవరూ రాలేదు. హాస్పిటల్ బెడ్ మీదే మార్తమ్మ మృతదేహం పడి ఉంది. చివరకు ఎవ్వరూ రాకపోడంతో హాస్పిటల్ సిబ్బందే ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Also Read: కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత..

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. రాష్ట్రంలో బుధ‌వారం నుంచి ఆంక్ష‌లు, పాక్షిక కర్ఫ్యూ