కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. అలాగే ఉద్యోగాలు ఉన్నవాళ్లకు ఆయా కంపెనీలు జీతాల్లో కోత విధించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సహాయంగా నిలిచేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ.. ఖాతాదారుల డబ్బును తీసుకునేందుకు వెసులుబాటును కల్పించింది. అయితే ఈ సమయంలోనే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందినకాడికి నొక్కేస్తున్నారు.
దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-ఈపీఎఫ్‌వో.. పీఎఫ్ ఖాతాదారులకు సోషల్ మీడియా వేదికగా ఓ హెచ్చరిక జారీ చేసింది. పీఎఫ్ ఖాతాదారులు.. తమ వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా కానీ, లేదా ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా కానీ ఎవ్వరికీ చెప్పవద్దని కోరింది. మీ ఫోన్ ఓటీపీ నెంబర్, ఆధార్ నెంబర్, యూఏఎన్ నెంబర్, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఫోన్ ద్వారా తెలియజేయవద్దని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది. మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల.. మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరింది. ఇలా ఎవరైనా కాల్ చేసినా.. మీకు ఏదైనా సమస్య వచ్చినా.. 1800 11 8005 నెంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది ఈపీఎఫ్‌వో.
Read More:
ఎమ్మెల్యే రోజా, సెల్వమణి దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఆలీ కూతురు.. మా గంగానదిగా!